కాజీపేట జంక్షన్కు వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం రావాల్సిన పలు రైళ్లు రాత్రి వరకు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేన్లో పడిగాపులు కాశారు. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని కాజీపేట నుంచి వివిధ రైళ్ల ద్వారా వెళ్లేందుకు ప్రయాణికులు శుక్రవారం పెద్ద సంఖ్యలో స్టేషన్కు చేరుకున్నారు. అయితే రైళ్లు నిర్ణీత సమయం కంటే గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్లా
రైళ్ల కోసం ప్రయాణికుల పడిగాపులు
Oct 8 2016 12:20 AM | Updated on Sep 4 2017 4:32 PM
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్కు వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం రావాల్సిన పలు రైళ్లు రాత్రి వరకు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేన్లో పడిగాపులు కాశారు. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని కాజీపేట నుంచి వివిధ రైళ్ల ద్వారా వెళ్లేందుకు ప్రయాణికులు శుక్రవారం పెద్ద సంఖ్యలో స్టేషన్కు చేరుకున్నారు. అయితే రైళ్లు నిర్ణీత సమయం కంటే గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు నిరీక్షించారు. రైళ్ల రాక కోసం పలుమార్లు విచారణ కౌంటర్ వద్దకు వెళ్లి వస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆలస్యంగా వచ్చిన రైళ్లు ఇవే..
తిరుపతి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే కృష్ణ ఎక్స్‌ప్రెస్ గంటన్నర, సికింద్రాబాద్ నుంచి సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు, గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గంట, పట్నా నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే పట్నా ఎక్స్‌ప్రెస్ గంట, న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గంట, సిర్పూర్‌కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే సిర్పూర్‌కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ అరగంట ఆలస్యంతో కాజీపేట జంక్షన్కు చేరుకున్నాయి.
Advertisement
Advertisement