నెల్లూరురూరల్ : వాహనచోదకుల అతివేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. బైక్‌పై అతివేంగా వెళ్తూ కారు ఢీకొని ఓ యువకుడు, ముందు వెళ్తున్న వాహనాన్ని అదిగమించబోయి బైకిస్ట్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు.
ప్రాణాలు తీసిన అతి వేగం
Aug 22 2016 12:22 AM | Updated on Oct 20 2018 6:19 PM
నెల్లూరురూరల్ :
వాహనచోదకుల అతివేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. బైక్‌పై అతివేంగా వెళ్తూ కారు ఢీకొని ఓ యువకుడు, ముందు వెళ్తున్న వాహనాన్ని అదిగమించబోయి బైకిస్ట్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనలు మండలంలోని వేర్వేర్లు చోట్ల జరిగాయి. నెల్లూరురూరల్ పోలీసుల కథనం మేరకు.. రాపూరు మండలం చిట్టుపాళెంకు చెందిన పులిబోయిన శివ(23) రాపూరు నుంచి నెల్లూరువైపు బైక్‌పై బయలుదేరాడు. ఆమంచర్ల వద్దకు వచ్చే సరికి ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొన్నాడు.. దీంతో తీవ్రంగా గాయపడిన శివను 108 వాహనంలో పెద్దాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు.
ఆర్టీసీ బస్సు ఢీకొని..
4వ మైలుకు చెందిన కాటంరెడ్డి రవీంద్రరెడ్డి (40) బైక్‌పై ఆదివారం నెల్లూరు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో నెల్లూరు నుంచి కొత్తకాలువ మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రవీంద్రరెడ్డిని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాసుపత్రికి తరలించారు. ఈ మేరకు రెండు ప్రమాదాల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.
Advertisement
Advertisement