నెల్లూరు-ముంబాయి ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆత్మకూరు రూరల్: నెల్లూరు-ముంబాయి ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు మండలం వాసిలి వద్ద చెరువు నిండిపోవడంతో హైవేపైకి భారీగా వరద చేరుకుంది. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉదృతి తగ్గితే గానీ, సహాయక చర్యలు చేపట్టేందుకు వీలులేని పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు.