
మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు నీట్ తప్పనిసరి
కేవలం ప్రభుత్వ కోటా సీట్లకు మాత్రమే నీట్ నుంచి మినహాయింపు ఉన్నందున ప్రైవేటు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం విద్యార్థులు నీట్-2 ను రాయాల్సిందేనని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
హైదరాబాద్: కేవలం ప్రభుత్వ కోటా సీట్లకు మాత్రమే నీట్ నుంచి మినహాయింపు ఉన్నందున ప్రైవేటు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం విద్యార్థులు నీట్-2 ను రాయాల్సిందేనని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వ కోటా సీట్లను ఎంసెట్‌తో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులకు సంబంధించి విద్యార్థులు పూర్తిగా నీట్‌ను అనుసరించాల్సిందేనని చెప్పారు. నీట్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అనుసరిస్తున్నందున రాష్ట్ర సిలబస్‌లో కూడా తగు మార్పులు చేస్తామన్నారు. సిలబస్ రూపకల్పనకు త్వరలో నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.