జెండా మోసేవాడే జెండా ఎగురవేయాలి | Need Power To bc | Sakshi
Sakshi News home page

జెండా మోసేవాడే జెండా ఎగురవేయాలి

Jul 24 2016 8:19 PM | Updated on Sep 4 2017 6:04 AM

మాట్లాడుతున్న గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌

మాట్లాడుతున్న గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌

ఆత్మకూర్‌: జనాభాలో 80శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలని జెండా మోసే వాడే జెండా ఎగురవేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్‌యాదవ్, యుగేందర్‌యాదవ్‌ అన్నారు.

– బీసీ సంఘం జిల్లా నేత గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌
ఆత్మకూర్‌ : జనాభాలో 80శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలని జెండా మోసే వాడే జెండా ఎగురవేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్‌యాదవ్, యుగేందర్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం ఆత్మకూర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, 500ల బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సకాలంలో వ్యవసాయ రైతులకు రుణమాఫీ వర్తింపజేసి కొత్త రుణాలు ఇవ్వాలని అన్నారు. అంబేద్కర్‌ విదేశీ విద్యానిధి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేయాలని, 50ఏళ్లు పైబడిన బీసీలకు ఆసరా పింఛన్లు వర్తింపజేయాలన్నారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు శ్రీను, సత్యనారాయణ, కురుమన్న, శోభన్, కొండన్న, రాజేష్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement