మహిళ మెడలో గొలుసు అపహరణ | Neck chain daylight kidnapping of the woman at home | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో గొలుసు అపహరణ

Jul 26 2016 6:00 PM | Updated on Sep 4 2017 6:24 AM

ఇంట్లో ఉన్న మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని ఆగంతకుడు అపహరించుకుపోయాడు.

భీమిలి:ఇంట్లో ఉన్న మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని ఆగంతకుడు అపహరించుకుపోయాడు. భీమిలిలోని సుభాష్‌రోడ్డులో పెంటపల్లి లక్ష్మీకాంతం(65) అనే విశ్రాంత ఉపాధ్యాయురాలు ఒంటరిగా ఉంటున్నారు. ఆమె మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో తలుపులు తీసి ఇంట్లో కూర్చుని ఉండగా వెనుకవైపు గోడదూకి వచ్చిన ఆగంతకుడు ఒక్కసారిగా ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించకుని పరారయ్యాడు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే దొంగతనానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీకాంతంకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారు వేరే చోట ఉంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement