'కేసీఆర్ సీఎం అయ్యారు..సాగర్ ఎండిపోయింది' | n-uttam-kumar-reddy-takes-on-telangana-cm-kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ సీఎం అయ్యారు..సాగర్ ఎండిపోయింది'

Jun 20 2016 1:35 PM | Updated on Aug 29 2018 5:52 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డిమండిపడ్డారు.

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కోదాడ లో సోమవారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ సీఎం అయ్యాక సాగర్ ఎండిపోయిందని విమర్శించారు. మిషన్ కాకతీయ అని చెరువులను కూడా ఎండబెట్టారన్నారు. ఉన్న ఇందిరమ్మ ఇళ్లకే గతి లేదు కానీ.. డబుల్ బెడ్రూం పథకం అంటున్నారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని చెప్పి..ఇప్పటి వరకు ఆ విషయం అడ్రస్ లేదని ఎద్దేవా చేశారు. ఈ రెండెళ్లలో ఏదైనా మేలు జరిగిందంటే అది టీఆర్ఎస్ కార్యకర్తలకే అని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement