అన్ని మండలాల్లో సూక్ష్మపోషకాలు | micro vitamins in all mandals | Sakshi
Sakshi News home page

అన్ని మండలాల్లో సూక్ష్మపోషకాలు

Jun 11 2017 11:36 PM | Updated on Sep 5 2017 1:22 PM

అన్ని మండలాల్లో సూక్ష్మపోషకాల (మైక్రో న్యూట్రియంట్స్‌) ఎరువులు నిల్వ ఉన్నందున ఏవోలను సంప్రదించి వాటిని రాయితీతో తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : అన్ని మండలాల్లో సూక్ష్మపోషకాల (మైక్రో న్యూట్రియంట్స్‌) ఎరువులు నిల్వ ఉన్నందున ఏవోలను సంప్రదించి వాటిని రాయితీతో తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. ప్రస్తుత 2017–18 సంవత్సరంలో ఖరీఫ్, రబీ పంట కాలానికి జిల్లాకు 25 వేల టన్నుల జిప్సం, 826 టన్నుల జింక్‌సల్ఫేట్, 138 టన్నుల బోరాన్‌ కేటాయించారన్నారు.  50 శాతం రాయితీ వర్తింపజేస్తూ టన్ను జిప్సంకు రైతు వాటాగా రూ.1,918 ప్రకారం, క్వింటా జింక్‌ సల్ఫేట్‌కు రూ.1,925 ప్రకారం, కిలో బోరాన్‌కు రూ.45 ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. 

జిప్సం, జింక్‌ సల్ఫేట్, బోరాన్‌ లాంటి సూక్ష్మపోషకాల విలువ తెలుసుకుని వేరుశనగ పంటలో వాడితే ప్రయోజనాలు పొందవచ్చన్నారు. భూసార పరీక్షల ఫలితాలను బట్టి సిఫారసు మేరకు వీటిని పంటలకు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. ప్రధానంగా పూత దశలో ఎకరా వేరుశనగకు 200 కిలోలు జిప్సం వేయడం వల్ల అధిక దిగుబడులు తప్పకుండా ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement