పిచ్చికుక్క స్వైరవిహారం | mental dogs Rampaging | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైరవిహారం

Aug 21 2016 7:32 PM | Updated on Sep 4 2017 10:16 AM

పిచ్చికుక్క స్వైరవిహారం

పిచ్చికుక్క స్వైరవిహారం

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం చెర్లభూత్కుర్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలో కనిపించిన వారిపైనా దాడి చేసింది.

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం చెర్లభూత్కుర్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలో కనిపించిన వారిపైనా దాడి చేసింది. ఈ ఘటనలో ఎనిమిది మందితోపాటు ఆవుకు గాయాలయ్యాయి. కుక్కదాడిలో ఒంటెల యశోద అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా.. ఆమెను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అరుణ్‌సాయి, ఆదిత్య, శ్రీలత, సుహాసిని, నరేందర్‌లను 108 సిబ్బంది కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించారు. గ్రామస్తులు పిచ్చికుక్కను చంపివేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement