కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | Man upsets due to family problems, commits suicide | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

May 17 2016 10:42 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఖమ్మం జిల్లా మధిర మండలం జిలుగువోడు గ్రామంలో కుటుంబ కలహాలతో షేక్ అబ్బాస్ అలీ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు

మధిర: ఖమ్మం జిల్లా మధిర మండలం జిలుగువోడు గ్రామంలో కుటుంబ కలహాలతో షేక్ అబ్బాస్ అలీ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులుగా ఇంటి తలుపులు మూసివేసి ఉండటం, ఇంటి నుంచి వాసవ వస్తుండటం గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల ఇంటి తలుపులు పగులగొట్టి చూడటంతో అబ్బాస్ ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. బాగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్న అబ్బాస్ ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement