breaking news
Commited
-
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
మధిర: ఖమ్మం జిల్లా మధిర మండలం జిలుగువోడు గ్రామంలో కుటుంబ కలహాలతో షేక్ అబ్బాస్ అలీ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులుగా ఇంటి తలుపులు మూసివేసి ఉండటం, ఇంటి నుంచి వాసవ వస్తుండటం గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల ఇంటి తలుపులు పగులగొట్టి చూడటంతో అబ్బాస్ ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. బాగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్న అబ్బాస్ ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
సమైక్యాంధ్రకు కట్టుబడింది వైసీపీనే
అత్తిలి, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్ర సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తోందని ఆ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష భగ్నానికి నిరసనగా స్థానిక బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ నాయకులు మోకాళ్లపై నిల్చుని దీక్ష చేశారు. ఈ సందర్భంగా రాధయ్య మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం నెలరోజులుగా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి స్పందనలేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతం ఏడారిగా మారుతుందన్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో నేడు ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెలగల అమ్మిరెడ్డి, పార్టీ నాయకులు వెలగల సత్తి పండురెడ్డి, పెన్మెత్స రామరాజు తదితరులు పాల్గొన్నారు.