సమైక్యాంధ్రకు కట్టుబడింది వైసీపీనే | YSRCP Commited for United State | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్రకు కట్టుబడింది వైసీపీనే

Sep 1 2013 2:24 AM | Updated on May 25 2018 9:10 PM

సమైక్య రాష్ట్ర సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తోందని ఆ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య అన్నారు.

అత్తిలి, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్ర సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తోందని ఆ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష భగ్నానికి నిరసనగా స్థానిక బస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు మోకాళ్లపై నిల్చుని దీక్ష చేశారు.
 
ఈ సందర్భంగా రాధయ్య మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం నెలరోజులుగా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి స్పందనలేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతం ఏడారిగా మారుతుందన్నారు. 
 
సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో నేడు ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ ఆందోళన  కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెలగల అమ్మిరెడ్డి, పార్టీ నాయకులు వెలగల సత్తి పండురెడ్డి, పెన్మెత్స రామరాజు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement