కార్మికుడ్ని కాటేసిన కరెంట్‌ | man dies of vidyut shock | Sakshi
Sakshi News home page

కార్మికుడ్ని కాటేసిన కరెంట్‌

May 7 2017 11:17 PM | Updated on Sep 5 2017 10:38 AM

గుంతకల్లు హనుమాన్‌ సర్కిల్‌లోని లక్ష్మీగణేశ్‌ సా మిల్‌లో పని చేసే రామిరెడ్డి కాలనీకి చెందిన దూదేకుల ఆకుల షబ్బీర్‌ బాషా (27) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురై ఆదివారం మరణించినట్లు స్థానికులు తెలిపారు.

గుంతకల్లు టౌన్‌ : గుంతకల్లు హనుమాన్‌ సర్కిల్‌లోని లక్ష్మీగణేశ్‌ సా మిల్‌లో పని చేసే రామిరెడ్డి కాలనీకి చెందిన దూదేకుల ఆకుల షబ్బీర్‌ బాషా (27) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురై ఆదివారం మరణించినట్లు స్థానికులు తెలిపారు. సా మిల్‌ను షబ్బీర్‌ సోదరుడు సత్తార్‌ అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. అందులోనే షబ్బీర్‌ కూడా పని చేస్తున్నాడన్నారు. రంపపు మిషన్‌లో మొద్దును కోస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయినట్లు తెలిపారు. తోటి కార్మికులు వెంటనే అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కాగా మృతుడికి భార్య ఆరీఫా, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement