రూ.18.33 కోట్లతో యాంత్రీకరణ పథకం | machinery scheme with Rs.18.33 crores | Sakshi
Sakshi News home page

రూ.18.33 కోట్లతో యాంత్రీకరణ పథకం

Jul 27 2016 10:57 PM | Updated on Sep 4 2017 6:35 AM

రూ.18.33 కోట్లతో యాంత్రీకరణ పథకం

రూ.18.33 కోట్లతో యాంత్రీకరణ పథకం

ఈ ఏడాది స్టేట్‌ డెవెలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్‌డీపీ) కింద రూ.18.33 కోట్ల బడ్జెట్‌తో యాంత్రీకరణ పథకం అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : ఈ ఏడాది స్టేట్‌ డెవెలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్‌డీపీ) కింద రూ.18.33 కోట్ల బడ్జెట్‌తో యాంత్రీకరణ పథకం అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. ఇందులో 600 మినీట్రాక్టర్ల పంపిణీకే రూ.11 కోట్లు కేటాయించారన్నారు. ఇవి కాకుండా 3,730 యంత్రోపకరణాలకు రూ.7.33 కోట్లు ఖర్చు చే స్తున్నట్లు చెప్పారు.  ఎస్సీ ఎస్టీ రైతులకు 70 శాతం, చిన్నసన్నకారు రైతులతో పాటు మహిళా రైతులకు 50 శాతం, మిగతా వర్గాల రైతులకు 40 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు.

ఎద్దులు, ట్రాక్టర్‌తో లాగే యంత్ర సామగ్రితోపాటు కోత యంత్రాలు, కోత అనంతరం పరికరాలు, ్రస్ప్రేయర్లు, టార్పాలిన్టు, భూమి చదును చేసే యంత్రాలు తదితర అన్ని రకాల పనిముట్లు రాయితీతో అందజేస్తామని తెలిపారు. అవసరమైన అర్హులైన రైతులు ఆధార్‌కార్డు, 1–బీ ఆధారంగా మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వ్యవసాయశాఖ మండల కార్యాలయాల్లో సంప్రదించి వినియోగించుకోవాలన్నారు. 

Advertisement

పోల్

Advertisement