కమనీయం..నిత్య కల్యాణం | lord rama kalynotsavam | Sakshi
Sakshi News home page

కమనీయం..నిత్య కల్యాణం

Aug 7 2016 11:19 PM | Updated on Sep 4 2017 8:17 AM

స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. భక్తజనం తిలకించి పులకించింది. ఆదివారం కావడం, అంత్య పుష్కరాలు జరుగుతుండడంతో భక్తుల రద్దీ పెరిగింది.

  • రాములోరికి విశేష పూజలు
  • భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. భక్తజనం తిలకించి పులకించింది. ఆదివారం కావడం, అంత్య పుష్కరాలు జరుగుతుండడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే బారులు తీరడంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. అర్చకులు అంతరాలయంలో రాములోరికి స్వర్ణ పుష్పార్చన చేశారు. సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేసి, పవిత్ర గోదావరి తీర్థ జలాలతో మూలవరులకు అభిషేకం చేశారు. 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన చేసి,  ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపానికి చేర్చి, వేద మంత్రోచ్ఛరణల నడుమ వైభవోపేతంగా నిత్యకల్యాణం చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న 80 జంటలకు, భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement