బిస్కెట్ల లారీ దగ్ధం | Larry burnt biscuits | Sakshi
Sakshi News home page

బిస్కెట్ల లారీ దగ్ధం

Nov 1 2016 12:08 AM | Updated on Jun 1 2018 8:39 PM

బిస్కెట్ల లారీ దగ్ధం - Sakshi

బిస్కెట్ల లారీ దగ్ధం

అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని శ్రీకష్ణదేవరాయ (ఎస్కేడీ) ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున బిస్కెట్ల లారీ దగ్ధమైంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

గుత్తి రూరల్‌:  అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని శ్రీకష్ణదేవరాయ (ఎస్కేడీ) ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున బిస్కెట్ల లారీ దగ్ధమైంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. లారీ నాగ్‌పూర్‌ నుంచి బెంగళూరుకు బిస్కెట్ల లోడుతో వెళుతోంది. గుత్తి శివారుకు రాగానే బ్యాటరీల వద్ద మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ గమనించకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. పది కిలోమీటర్ల వరకూ అలాగే వెళ్లడంతో మంటలు వ్యాపించి.. బిస్కెట్‌ డబ్బాలు కాలిపోయాయి. మంటలు లారీ  టైర్లకు కూడా పాకాయి. వెనుక వచ్చిన లారీ డ్రైవర్లు కేకలు వేయడంతో డ్రైవర్‌ అప్రమత్తమై లారీని అపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మంటలు భారీగా చెలరేగాయి. బిసెట్లన్నీ బూడిదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement