కోదండరాంను ఆహ్వానించిన అఖిలపక్షం | invited Kodandaram | Sakshi
Sakshi News home page

కోదండరాంను ఆహ్వానించిన అఖిలపక్షం

Sep 22 2016 11:32 PM | Updated on Jul 29 2019 2:51 PM

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈప్రాంత ప్రజల ఆకాంక్షను తెలుసుకునేందుకు హుస్నాబాద్‌ రావాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ కోదండరాంను ఆహ్వానించినట్లు టీపీసీసీ కార్యదర్శి, హౌజ్‌ఫెడ్‌ రాష్ట్ర మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తెలిపారు.

హుస్నాబాద్‌ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈప్రాంత ప్రజల ఆకాంక్షను తెలుసుకునేందుకు హుస్నాబాద్‌ రావాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ కోదండరాంను ఆహ్వానించినట్లు టీపీసీసీ కార్యదర్శి, హౌజ్‌ఫెడ్‌ రాష్ట్ర మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తెలిపారు. హుస్నాబాద్, కోహెడ మండలాల్లోని అత్యధిక గ్రామాలు కరీంనగర్‌లో కొనసాగించాలని తీర్మానాలు చేసినట్లు తెలిపామన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా హుస్నాబాద్‌ను మూడు ముక్కలు చేస్తున్నారని చెప్పామన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు సంఘీభావం తెలపాలని కోరగా సానుకూలంగా స్పందించి ఈ నెల 30న హుస్నాబాద్‌కు వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, న్యాయవాదులు శ్రీనివాస్‌రెడ్డి, బద్దిపడిగ రాజిరెడ్డి, చిత్తారి రవీందర్, భీమాసాహెబ్‌ పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement