అంతర్‌వర్సిటీ బాస్కెట్‌బాల్‌ విజేత ఏసీ కళాశాల | Inter varsity basket ball winner is AC College | Sakshi
Sakshi News home page

అంతర్‌వర్సిటీ బాస్కెట్‌బాల్‌ విజేత ఏసీ కళాశాల

Nov 24 2016 10:34 PM | Updated on Sep 4 2017 9:01 PM

అంతర్‌వర్సిటీ బాస్కెట్‌బాల్‌ విజేత ఏసీ కళాశాల

అంతర్‌వర్సిటీ బాస్కెట్‌బాల్‌ విజేత ఏసీ కళాశాల

యూనివర్సిటీ క్రీడా మైదానంలో రెండు రోజులపాటు జరిగిన అంతర్‌ కళాశాలల బాస్కెట్‌బాల్‌ పురుషుల పోటీలు..

ఏఎన్‌యూ: యూనివర్సిటీ క్రీడా మైదానంలో రెండు రోజులపాటు జరిగిన అంతర్‌ కళాశాలల బాస్కెట్‌బాల్‌ పురుషుల పోటీలు గురువారంతో ముగిశాయి. ఫైనల్లో తలపడిన ఏసీ కళాశాల, ఏఎన్‌యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానాన్ని జేకేసీ కళాశాల జట్టు కైవసం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.జాన్‌పాల్‌ ము అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఏఎన్‌యూకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్, ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఇ.శ్రీనివాసరెడ్డి, యోగా కోర్సు కో-ఆర్డినేటర్‌ డి. సూర్యనారాయణ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జాన్సన్, తదితరులు పాల్గొన్నారు.
 
సౌత్‌జోన్‌ పోటీలకు ఏఎన్‌యూ జట్టు ఎంపిక 
సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే ఏఎన్‌యూ జట్టును ఎంపిక చేశారు.  ఎ.కిషోర్, ఎం.రత్నకుమార్, ఎ.ఆనందకుమార్, ఎస్‌.కె.మసూద్‌ (ఏసీ కళాశాల), వి.ఉదయ్, డి.సత్యనారాయణ, పి.శివప్రసాద్‌ (ఏఎన్‌యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల), ఎల్‌.బ్రహ్మారెడ్డి, ఎ.పవన్‌కుమార్‌ (జేకేసీ కళాశాల), ఎం.తేజశ్వి (ఆర్వీఆర్‌ అండ్‌ జేసీ కళాశాల), ఎ.ఫ్రాంక్లిన్‌ (ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ కళాశాల), బి.అవినాష్‌ (ఏఎన్‌యూ ఆర్ట్స్‌ కళాశాల) జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement