తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడిలో పడిందని, ప్రభుత్వాన్ని విమర్శించడం పీడీఎస్‌యూ నాయకులు ఫ్యాషన్ అయిపోయిందని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎరినాగుల మల్లికార్జున్ అన్నారు.
‘ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునేది లే దు’
Jul 28 2016 11:37 PM | Updated on Sep 4 2017 6:46 AM
చెన్నూర్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడిలో పడిందని, ప్రభుత్వాన్ని విమర్శించడం పీడీఎస్‌యూ నాయకులు ఫ్యాషన్ అయిపోయిందని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎరినాగుల మల్లికార్జున్ అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం నిబద్ధతతో విచారిస్తోందని పేర్కొన్నారు.
కేజీ నుంచి పీజీ విద్యలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 250 గురుకుల పాఠశాలలను ప్రారంభించి తరగతులు నిర్వహిస్తోందని వివరించారు. పీడీఎస్‌యూ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడడం సరికాదన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు సైదుల రమేశ్, నాయకులు తగరం కిషన్, అయిత రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, నయాబ్‌ఖాన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement


