తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం కలియుగ దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం కలియుగ దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) స్వామివారిని 77,877 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రాతః కాల దర్శన సమయంలో మంచు లక్ష్మీ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డీజీ కే.ఎల్ వరప్రసాద్ శ్రీవారి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.