హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌గా కడప మహిళల జట్టు | handball champion kadapa | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌గా కడప మహిళల జట్టు

Jul 23 2016 11:15 PM | Updated on Sep 4 2017 5:54 AM

హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌గా కడప మహిళల జట్టు

హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌గా కడప మహిళల జట్టు

ఏపీ హ్యాండ్‌బాల్‌ మహిళా ఛాంపియన్‌గా కడప జట్టు నిలిచింది. కర్నూలు నగరంలోని సిల్వర్‌జూబ్లీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో కడప జట్టు సత్తాచాటింది.

కడప స్పోర్ట్స్‌:
ఏపీ హ్యాండ్‌బాల్‌ మహిళా ఛాంపియన్‌గా కడప జట్టు నిలిచింది. కర్నూలు నగరంలోని సిల్వర్‌జూబ్లీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో కడప జట్టు సత్తాచాటింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రకాశం జట్టుతో తలపడి 13–4 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. అదే విధంగా శనివారం నిర్వహించిన క్వార్టర్‌ ఫైనల్‌లో తూర్పుగోదావరిపై, సెమీఫైనల్‌లో శ్రీకాకుళం జట్టుపై విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించిన జిల్లా మహిళల జట్టు  ఫైనల్‌లో సైతం అదే జోరు కొనసాగించి విజేతగా నిలిచింది. నిర్వాహకులు విన్నర్స్‌ ట్రోఫీని అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా క్రీడాకారిణుల ప్రతిభ పట్ల జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వి.లక్ష్మణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement