వాళ్లిద్దరి వల్లే కాంగ్రెస్ సర్వనాశనం: గుత్తా | gutta sukhendar reddy takes on uttam, komatireddy venkatareddy | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరి వల్లే కాంగ్రెస్ సర్వనాశనం: గుత్తా

Jul 11 2016 12:27 PM | Updated on Sep 19 2019 8:44 PM

వాళ్లిద్దరి వల్లే కాంగ్రెస్ సర్వనాశనం: గుత్తా - Sakshi

వాళ్లిద్దరి వల్లే కాంగ్రెస్ సర్వనాశనం: గుత్తా

కాంగ్రెస్ నాయకులకు తనను విమర్శించే అర్హత లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నల్లగొండ: కాంగ్రెస్ నాయకులకు తనను విమర్శించే అర్హత లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనమైందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత జానారెడ్డి పలుమార్లు రాజకీయ సన్యాసం చేస్తానంటేనే తాము పార్టీ మారామని గుత్తా తెలిపారు. మరి బద్ధశత్రువులైన ఉత్తమ్, కోమటిరెడ్డిలు మంచి మిత్రులుగా ఎప్పుడు మారారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లదంతా ధృతరాష్ట్ర కౌగిలేనని గుత్తా వ్యాఖ్యలు చేశారు. కాగా గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement