జాతీయ, రాషీ్ట్రయ రహదారి జంక్షన్ గుండుగొలను వద్ద వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఆదివారం సెలవురోజు కావడంతో విజయవాడ వైపుగా వేల సంఖ్యలో వాహనాలు తరలివెళ్లాయి. దీంతో హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
గుండుగొలను వద్ద వాహనాల నిలిపివేత
Aug 22 2016 12:45 AM | Updated on Sep 4 2017 10:16 AM
భీమడోలు : జాతీయ, రాషీ్ట్రయ రహదారి జంక్షన్ గుండుగొలను వద్ద వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఆదివారం సెలవురోజు కావడంతో విజయవాడ వైపుగా వేల సంఖ్యలో వాహనాలు తరలివెళ్లాయి. దీంతో హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుండుగొలను నుంచి విజయవాడ వైపుగా వెళ్లే భారీ వాహనాలు, లారీలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను నారాయణపురం మీదుగా మళ్లించారు.
Advertisement
Advertisement