Sakshi News home page

శాస్త్రవేత్తలుగా ఎదగాలి

Published Tue, Jan 31 2017 11:54 PM

శాస్త్రవేత్తలుగా ఎదగాలి

– విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలి
– శాస్త్ర సాంకేతిక రంగాల్లో
   అపార అవకాశాలు
– యోగివేమన వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌
 డాక్టర్‌ ఎ.రామచంద్రారెడ్డి  పిలుపు
కర్నూలు (ఆర్‌యూ):  విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎ.రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.   ఐదు రోజుల నుంచి రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సైన్స్‌ ఇంటర్న్‌షిప్‌ ఇన్‌స్పైర్‌–2017 మంగళవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైన్స్‌ రంగంలో   అపార అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.   నేర్చుకున్నది ఇతరులతో పంచుకోవాడం అలవాటు చేసుకోవాలని చెప్పారు.
 
ఆర్‌యూ వీసీ నరసింహులు మాట్లాడుతూ సైన్స్‌ లేనిదే ప్రపంచం లేదన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలకు మెమెంటో  అందజేశారు.  అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌, క్యాంపు కోఆర్డినేటర్‌   చక్రవర్తి, అడిషనల్‌ కోఆర్డినేటర్లు ఎస్‌.రమణయ్య, డాక్టర్‌ కమల, ప్రొఫెసర్లు సంజీవరావు, సునీత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement