12న గ్రూప్‌–2 ఉచిత మోడల్‌ పరీక్ష | group-2 free model test on 12 | Sakshi
Sakshi News home page

12న గ్రూప్‌–2 ఉచిత మోడల్‌ పరీక్ష

Feb 4 2017 11:55 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఆశ్రిత ఎడ్యుకేషనల్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల నిపుణులు, సామాజిక విద్యావేత్త (2008 గ్రూప్‌–2 విజేత) వి.ఉషాకిరణ్‌ నిర్వహణలో ఈనెల 12న ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 ఉచిత మోడల్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఆశ్రిత ఎడ్యుకేషనల్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల నిపుణులు, సామాజిక విద్యావేత్త (2008 గ్రూప్‌–2 విజేత) వి.ఉషాకిరణ్‌ నిర్వహణలో ఈనెల 12న ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 ఉచిత మోడల్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉద్యోగార్థులు విజయం సాధించడం కోసం రూ. 500 విలువ చేసే మెటీరియల్‌ ఇవ్వనున్నట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మొదటి ఐదుమంది రాష్ట్ర టాపర్స్‌కు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున, జోనల్‌ టాపర్స్‌కు ఒక్కొక్కరికి రూ. 5 వేలు చొప్పున హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతులు మీదుగా అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ పరీక్షలో  120కు పైగా మార్కులు సాధించే 100 మందికి గ్రూప్‌–2 మెయిన్స్‌కు ఉచిత ఇంటెన్సివ్‌ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లాల వారిగా అభ్యర్థులు పరీక్ష సెంటర్లకోసం పౌండేషన్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈనెల 6 వరకు వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 93925 85533 నంబరులో సంప్రదించాలని కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement