బరాత్ నుంచి వెళ్లి ఉరేసుకున్న వరుడు! | Groom Committed suicide | Sakshi
Sakshi News home page

బరాత్ నుంచి వెళ్లి ఉరేసుకున్న వరుడు!

Apr 4 2016 6:19 AM | Updated on Nov 6 2018 8:22 PM

బరాత్ నుంచి వెళ్లి ఉరేసుకున్న వరుడు! - Sakshi

బరాత్ నుంచి వెళ్లి ఉరేసుకున్న వరుడు!

కొన్ని గంటల ముందు ఘనంగా పెళ్లి అయ్యింది. విందు తర్వాత ఘనంగా బరాత్(ఊరేగింపు) జరుగుతోంది.

పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ నోట్

సిర్పూర్(టి): కొన్ని గంటల ముందు ఘనంగా పెళ్లి అయ్యింది. విందు తర్వాత ఘనంగా బరాత్(ఊరేగింపు) జరుగుతోంది. బరాత్ నుంచి మంచినీళ్లు తాగి వస్తానని చెప్పి వెళ్లిన పెళ్లి కొడుకు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం ధరంపల్లిలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన కావుడే సదాశివ్(25) వ్యవసాయం చేసేవాడు. అతనికి కౌటాల మండలం కన్నెపల్లికి చెందిన అమృతతో శనివారం సాయంత్రం వివాహం జరిగింది.

విందు ముగిశాక రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బరాత్(ఊరేగింపు) జరుగుతోంది. సమయం 10 గంటలు కావొస్తుండగా కొత్త పెళ్లి కొడుకు సదాశివ్ నీళ్లు తాగి వస్తానని చెప్పి పక్కకు వెళ్లాడు. ఆ తర్వాత సమీపంలోని వాగు వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. అతడి జేబులో దొరికిన సూసైడ్ నోట్‌లో తనకీ పెళ్లి ఇష్టం లేదని రాశాడు. ఈ హఠాత్పరిణామంతో ఇటు అబ్బారుు తరఫు వారు.. అటు అమ్మారుు వైపు వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యూరు.  మృతుడి తండ్రి కావుడే మల్లయ్య ఫిర్యాదు మేరకు సిర్పూర్(టి) ఎస్సై ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement