డీఈఓకు పదోన్నతి కల్పిస్తూ జీఓ జారీ | go issue of deo pramotion | Sakshi
Sakshi News home page

డీఈఓకు పదోన్నతి కల్పిస్తూ జీఓ జారీ

Feb 6 2017 10:47 PM | Updated on Sep 5 2017 3:03 AM

ప్రభుత్వ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ, డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.రవీంద్రనాథ్‌రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాసు జీఓ ఆర్‌టీ నెం.23 జారీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నూలు(సిటీ): ప్రభుత్వ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ, డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.రవీంద్రనాథ్‌రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాసు జీఓ ఆర్‌టీ నెం.23 జారీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనకు ఒకేషనల్‌ విద్య జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ అమరావతికి బదిలీ చేశారు. డీఈఓ ఇన్‌చార్జి బాధ్యతలను ఇతరులకు అప్పగించేందుకు కలెక్టర్‌ సుముఖంగా లేకపోవడంతో జేడీగా బాధ్యతలు తీసుకున్నా పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు డీఈఓగా రవీంద్రనాథ్‌రెడ్డినే కొనసాగించేందుకు కలెక్టర్‌ ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement