భట్టిప్రోలు : అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి నుంచి పోలీసులు ఆదివారం రాత్రి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
కిలో గంజాయి స్వాధీనం
Feb 13 2017 11:20 PM | Updated on Sep 5 2017 3:37 AM
భట్టిప్రోలు : అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి నుంచి పోలీసులు ఆదివారం రాత్రి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భట్టిప్రోలులోని రైల్వే గేటు వద్ద ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని రేపల్లె సీఐ పి. ఆంజనేయులకు సమాచారం రావడంతో ఆయన ఎస్‌ఐ ఈ. బాలనాగిరెడ్డిని అప్రమత్తం చేశారు. వెంటనే ఆయన ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ తచ్చాడుతున్న నల్లబోతుల ఇమ్మానియేల్, గుత్తి రమేష్‌ను అదుపులోకి తీసుకొని వారి నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వీరిని రేపల్లె కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండుకు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement