ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు | friction in two groups at anantapur district | Sakshi
Sakshi News home page

ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు

Jul 18 2016 2:29 PM | Updated on Aug 25 2018 5:38 PM

భూ వివాదంలో చెలరేగిన ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

పామిడి: భూ వివాదంలో చెలరేగిన ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం పాలెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకరయ్య, నాగేంద్ర వర్గీయుల మధ్య గత కొన్ని రోజులుగా భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇరువర్గాలకు చెందిన వారు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement