స్వాతంత్య్ర సమరయోధుడు మృతి | Freedom fighter death | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

Aug 25 2016 11:16 PM | Updated on Sep 4 2017 10:52 AM

: ప్రభాకర్‌రావు(ఫైల్‌)

: ప్రభాకర్‌రావు(ఫైల్‌)

స్వాతంత్య్ర సమరయోధుడు, మధిర మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడపు ప్రభాకర్‌రావు(97) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతిచెందారు.

మధిర రూరల్‌ : స్వాతంత్య్ర సమరయోధుడు, మధిర మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడపు ప్రభాకర్‌రావు(97) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతిచెందారు. 1964లో మధిర మున్సిపాల్టీకి చివరి చైర్మన్‌గా పనిచేశారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా, మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డికి ముఖ్య సహచరుడిగా పనిచేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని మధిర మాజీ సర్పంచ్‌ వాసంశెట్టి లక్ష్మీప్రియ తెలిపారు. గురువారం పలువురు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా, ప్రభాకర్‌రావుకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement