పోరాడి.. గెలిచింది | Fought and won | Sakshi
Sakshi News home page

పోరాడి.. గెలిచింది

Jul 29 2016 9:19 AM | Updated on Sep 4 2017 6:46 AM

పోరాడి.. గెలిచింది

పోరాడి.. గెలిచింది

వరంగల్ జిల్లాలో అటెండర్‌ పోస్టు కోసం ఓ మహిళ పోరాడి విజయం సాధించింది.

అటెండర్‌ పోస్టు కోసం ఆత్మహత్యాయత్నం
అధికారుల చొరవతో సద్దుమణిగిన వివాదం

 
వరంగల్ : ప్రభుత్వ పాఠశాలలో నియమిం చే అటెండర్‌ పోస్టు న్యాయంగా తనకే ఇవ్వాలంటూ ఓ మహిళ పోరాడి విజయం సాధిం చింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఇంటికన్నె జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో అటెండర్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు లు ఆహ్వానించారు. ఉన్నత పాఠశాలలో 19 మంది దరఖాస్తు చేయగా, స్కూల్‌ మేనేజ్‌మెం ట్‌ కమిటీ వారు సర్పంచ్‌ కుమారుడైన భరత్‌ను ఆ పోస్టుకు ఎంపిక చేశారు. ప్రాథమిక పాఠశాలలో మెుదట హన్మకొండ సౌందర్య, వెంకన్న దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత పాఠశాలలో దరఖాస్తు చేసుకుని, అక్కడ రాకపోవడంతో మల్లేష్‌ అనే వ్యక్తి ఆ తర్వాత పీఎస్‌లో అప్లై చేశాడు.

కాగా, కమిటీ వారు మల్లేష్‌నే అటెండర్‌గా నియమించారు. దీంతో సౌందర్య పాఠశాలకు చేరుకుని, తన భర్త గతంలో యేళ్ల తరబడి పాఠశాలలో స్వీపర్‌గా పనిచేశాడని.. న్యాయంగా ఆ పోస్టు తమకే రావాలని.. పైగా గడువు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తారని వాగ్వాదానికి దిగింది.ఉపాధ్యాయులు కల్పించుకుని ‘నువ్వు పనిచేయలేవ’ని చెప్పడంతో తన కూతురుకైనా ఆ పోస్టు ఇవ్వాలంటూ ఒంటిపై కిరోసిన్‌ పో సుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

దీంతో అక్కడున్న వారు ఆమెను అడ్డుకున్నారు. ఏకపక్షంగా ఎలా ఎంపిక చేస్తారంటూ కొందరు సౌందర్యకు మద్దతుగా కమిటీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సౌందర్యకు న్యా యం జరిగేలా చూస్తామని గ్రామపెద్దలు, ఎస్‌ఎంసీ కమిటి సభ్యులు తెలిపారు. అయినా ఆమె వారి మాట వినకుండా స్కూల్‌ ఎదుట బైఠాయించింది. అనంతరం ఎంఈఓ నర్సిం హరావు, సర్పంచ్‌ ఐతే సారయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్, గ్రామస్తుల సమక్షంలో సౌందర్యను ఎంపిక చేయడంతో వివాదం సద్దుమణిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement