చెరువులో మునిగి మత్యకారుడు మృతి | fish hunter dead in cheruvu | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి మత్యకారుడు మృతి

Sep 4 2016 7:48 PM | Updated on Sep 4 2017 12:18 PM

సిరిసిల్ల టౌన్‌ : నాలుగు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ఆదివారం చెరువులో శవమై తేలాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణ ంలోని బోయివాడకు చెందిన కూర రాములు(40) గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. ఆరోజు రాత్రి వరకు ఇంటికి రాలేదు.

సిరిసిల్ల టౌన్‌ : నాలుగు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ఆదివారం చెరువులో శవమై తేలాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణ ంలోని బోయివాడకు చెందిన కూర రాములు(40) గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. ఆరోజు రాత్రి వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు.  శుక్రవారం మధ్యాహ్నం దామెరకుంట చెరువు వద్ద రాములు సైకిల్, దుస్తులు ఉండటంతో ఈతగాళ్లు చెరువులో గాలించారు. అయినా జాడ కనిపించలేదు. చెరువులోని తామర పూల ఊబిలో చిక్కుకుని ఉంటాడని భావించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రాములు మృతదేహం చెరువులో తేలియాడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అక్కడే పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రాములుకు భార్య అనిత ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement