కనుల పండువగా ‘తిరంగ్‌ యాత్ర’ | eye festival 'tirang yatra' | Sakshi
Sakshi News home page

కనుల పండువగా ‘తిరంగ్‌ యాత్ర’

Aug 15 2016 12:02 AM | Updated on Sep 4 2017 9:17 AM

కనుల పండువగా ‘తిరంగ్‌ యాత్ర’

కనుల పండువగా ‘తిరంగ్‌ యాత్ర’

నెహ్రూ యువజన కేంద్రం జిల్లా సమన్వయ అధికారి (డీవైసీ) మనోరంజన్‌ ఆధ్వర్యంలో 70 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేటలోని నిట్‌లో ఆదివారం ‘తిరంగ్‌ యాత్ర.. యాద్‌ కరో కుర్భాని’ నినాదంతో ర్యాలీ నిర్వహించారు.

కాజీపేట రూరల్‌ : నెహ్రూ యువజన కేంద్రం జిల్లా సమన్వయ అధికారి (డీవైసీ) మనోరంజన్‌ ఆధ్వర్యంలో 70 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేటలోని నిట్‌లో ఆదివారం ‘తిరంగ్‌ యాత్ర.. యాద్‌ కరో కుర్భాని’ నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సం దర్భంగా ఫాతిమానగర్‌ సెంటర్‌ నుంచి నిట్‌ వరకు ఎన్‌సీసీ కేడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు, యువజన సంఘం సభ్యులు, అధికారులు జాతీయ జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిట్‌ ఫ్యాకల్టీ క్లబ్‌ గ్రౌండ్‌ ఆవరణలో మాజీ సైనికుడు కష్పారెడ్డితో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
 
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
ర్యాలీ అనంతరం నిట్‌ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఇన్‌చార్జీ డైరెక్టర్‌ ఆర్‌వీ చలం మాట్లాడుతూ దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. నెహ్రూ యువజన కేంద్రం జిల్లా సమన్వయ అధికారి మనోరంజన్‌ మాట్లాడుతూ ‘త్రివర్ణ యాత్ర –అమరవీరుల త్యాగాలను స్మరించుకోండి’ నినాదంతో ర్యాలీలు నిర్వహించి విద్యార్థులు, యువతలో దేశభక్తి నింపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో రిటైర్డ్‌ లెక్చరర్‌ గుజ్జుల నర్సయ్య, నిట్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన్‌ అఫె్పౖర్స్‌ రమణారెడ్డి, కేఎంసీ పీఓ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌సీపీ  కెప్టెన్‌ న రేంద్ర, నాగరాజు పాల్గొన్నారు.
 
వీరజవాన్‌ తల్లి, మాజీ సైనికుడికి సన్మానం
కార్గిల్‌ యుద్ధంలో చనిపోయిన కరీమాబాద్‌కు చెం దిన వీరజవాన్‌ సతీష్‌ తల్లి సుజాత, ఇండోపాక్‌ యుద్ధంలో కాలుపోగొట్టుకున్న కాజీపేటకు చెంది న సైనికుడు కష్పారెడ్డిని, గుజ్జుల నర్సయ్యను.. నిట్‌ ఇ¯Œæచార్జి డైరెక్టర్‌ చలం, నెహ్రూ యువజన కేంద్రం డీవైసీ మనోరంజన్, అధికారులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తన కొడుకు దేశం కోసం వీర మరణం పొందాడని తెలిపారు. కష్పారెడ్డి మాట్లాడుతూ దేశరక్షణ కోసం పాటుపడే సైనికులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం చిరంజీవి నేతృత్వంలో దూపకుంట కళాకారులు పాడిన దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. నేషనల్‌ యూత్‌ ఆవార్డు ఎ.మధు, రాజ్‌కుమార్, మధుసూదన్, బైరపాక రవిందర్, అరవింద్, ఆర్య, నరేష్‌పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement