నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు | exise attacks | Sakshi
Sakshi News home page

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

May 1 2017 12:23 AM | Updated on Sep 5 2017 10:04 AM

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీరాములు ఆదేశాల మేరకు కర్నూలు ఎక్సైజ్‌ సీఐ పద్మావతి సిబ్బందితో కర్నూలు బంగారుపేట, ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో దాడులు నిర్వహించారు.

కర్నూలు :  ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీరాములు ఆదేశాల మేరకు కర్నూలు ఎక్సైజ్‌ సీఐ పద్మావతి సిబ్బందితో కర్నూలు బంగారుపేట, ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో దాడులు నిర్వహించారు. బంగారుపేటకు చెందిన నీలిషికారి సన్ను దగ్గర 1.65 కేజీల ఎండిన గంజాయి, ఉయ్యాలవాడకు చెందిన రంగమ్మ నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. దాడుల్లో ఎస్‌ఐ దుర్గా నవీన్‌బాబు, హరికృష్ణ, హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లికార్జున, మాదన్న, లీలా మోహన్,రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement