ఉత్సాహంగా క్రీడా ఎంపికలు | Exciting sporting options | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా క్రీడా ఎంపికలు

Jul 26 2016 5:20 PM | Updated on May 29 2018 6:13 PM

ఉత్సాహంగా క్రీడా ఎంపికలు - Sakshi

ఉత్సాహంగా క్రీడా ఎంపికలు

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు రెండోరోజూ కొనసాగాయి. మంగళవారం నిర్వహించిన ఎంపికల ప్రక్రియను డీఎస్‌డీఓ ఎం.ఎస్‌ఎల్‌.ఎన్‌. శర్మ, శాప్‌ డైరెక్టర్‌ డి. జయచంద్ర పర్యవేక్షించారు.

కడప స్పోర్ట్స్‌ :
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు రెండోరోజూ కొనసాగాయి. మంగళవారం నిర్వహించిన ఎంపికల ప్రక్రియను డీఎస్‌డీఓ ఎం.ఎస్‌ఎల్‌.ఎన్‌. శర్మ, శాప్‌ డైరెక్టర్‌ డి. జయచంద్ర పర్యవేక్షించారు. రెండోరోజు నిర్వహించిన ఎంపికలకు 14 మండలాల నుంచి 27 మంది బాలురు 10 మంది బాలికలు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు  వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో మూడురోజుల అసెస్‌మెంట్‌ ట్రైనింగ్‌ అనంతరం 6వ తేదీ తుది ఎంపికలు నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ, నూర్, డీఎస్‌ఏ సిబ్బంది అక్బర్, బాషా తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement