జ్యోతిష్మతిలో ముగిసిన శిక్షణ శిబిరం | end the traing in jyothismathi | Sakshi
Sakshi News home page

జ్యోతిష్మతిలో ముగిసిన శిక్షణ శిబిరం

Jul 21 2016 8:47 PM | Updated on Sep 4 2017 5:41 AM

తిమ్మాపూర్‌ : మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫైనలియర్‌ విద్యార్థులకు తెలంగాణ అకాడమి ఫర్‌ స్కిల్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహించిన ప్రొఫెసర్స్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. టాస్క్‌ సీనియర్‌ ట్రైనర్లు బెన్నీ జార్జ్, రాజరాజేశ్వరి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు.

తిమ్మాపూర్‌ : మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫైనలియర్‌ విద్యార్థులకు తెలంగాణ అకాడమి ఫర్‌ స్కిల్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహించిన ప్రొఫెసర్స్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. టాస్క్‌ సీనియర్‌ ట్రైనర్లు బెన్నీ జార్జ్, రాజరాజేశ్వరి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇందులో లక్ష్యాలను నిర్ధారించుకోవడం, సృజనాత్మకత, వాక్చాతుర్యం, రచనల్లో నైపుణ్యాలు పెంపొందించడం, సమయపాలన, మర్యాదక్రమాలు, నీతి విలువలు, వాణిజ్య సంబంధ ఆంగ్లంలో నిపుణత సాధించడం వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని కళాశాల చైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు సూచించారు. ప్రిన్సిపాల్‌ విజేంద్రకుమార్, లెక్చరర్లు వైశాలి, గోపాల్‌రెడ్డి, విశ్వప్రకాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement