కరీంనగర్‌లో ఇక్లాట్ డెలివరీ సెంటర్... | eclat Health Solutions delivery center in Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో ఇక్లాట్ డెలివరీ సెంటర్...

Aug 16 2016 5:35 PM | Updated on Sep 4 2018 5:21 PM

మెడికల్ కోడింగ్ సేవల్లో ఉన్న యూఎస్‌కు చెందిన ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కరీంనగర్‌లో డెలివరీ సెంటర్‌ను నెలకొల్పింది.

- 1,000 మందికి ఉద్యోగాలు
-రూ.100 కోట్లకుపైగా పెట్టుబడి.. ఇక్లాట్ సీఈవో కార్తీక్ పోల్సాని

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో

మెడికల్ కోడింగ్ సేవల్లో ఉన్న యూఎస్‌కు చెందిన ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కరీంనగర్‌లో డెలివరీ సెంటర్‌ను నెలకొల్పింది. ఇందుకు రూ.100 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. దీని ద్వారా రెండేళ్లలో ప్రత్యక్షంగా 1,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇప్పటికే ఇక్కడ 200 మంది పనిచేస్తున్నారు. సంస్థకు యూఎస్‌లో మూడు కార్యాలయాలు, భారత్‌లో హైదరాబాద్, చెన్నైలో డెలివరీ సెంటర్లున్నాయి. డెలివరీ కేంద్రం ఏర్పాటుకై ఈ ఏడాది మే నెలలో తెలంగాణ ప్రభుత్వానికి, కంపెనీకి యూఎస్‌లో ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కొత్త సెంటర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం(ఆగస్టు 17) ప్రారంభిస్తారని ఇక్లాట్ సీఈవో కార్తీక్ పోల్సాని మంగళవారం మీడియాకు తెలిపారు.


అయిదేళ్లలో 5,000 మంది..
ఇక్లాట్ హైదరాబాద్ సెంటర్‌లో 250 మంది, చెన్నైలో 100, యూఎస్‌లో 40 మంది పనిచేస్తున్నారు. అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 5,000లకు చేరుస్తామని కార్తీక్ వెల్లడించారు. లైఫ్ సెన్సైస్ చదివినవారికి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ‘సమర్థులు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఉన్నారు. పనిచేస్తున్నవారిలో 70 శాతం మంది తెలుగు మీడియంలో చదివినవారే. వరంగల్‌లోనూ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని పోల్సాని గ్రూప్ చైర్మన్ సుధాకర్ రావు పోల్సాని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement