‘ఈ–కోలి’ నివారణకు చర్యలు | E-coli problem solved | Sakshi
Sakshi News home page

‘ఈ–కోలి’ నివారణకు చర్యలు

Aug 11 2016 10:32 PM | Updated on Sep 4 2017 8:52 AM

‘ఈ–కోలి’ నివారణకు చర్యలు

‘ఈ–కోలి’ నివారణకు చర్యలు

తానగరం వద్ద కృష్ణా నీటిలో ఈ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్టు ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు.

‘సాక్షి’ ఎఫెక్ట్‌
 
సీతానగరం (తాడేపల్లి రూరల్‌) : సీతానగరం వద్ద కృష్ణా నీటిలో ఈ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్టు ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. పబ్లిక్‌ హెల్త్, పంచాయతీ రాజ్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రాత్రి పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లు చేశారు. నది  నుంచి లీడింగ్‌ కెనాల్‌కు నీరు వచ్చే ప్రాంతంలో క్లోరిన్‌ కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీతానగరం ఒకటో నంబర్‌ ఘాట్‌లో క్లోరిన్‌ కలిపేందుకు అవసరమైన మోటార్లు, పైపుల ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమయ్యారు. లీడింగ్‌ చానల్‌లో భక్తులు స్నానం ఆచరించేందుకు నీరు వదలగానే దానిలో క్లోరిన్‌ కలపనున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement