శాశ్వతంగా కరువు జిల్లాగా మార్చొద్దు | dont make a dry district | Sakshi
Sakshi News home page

శాశ్వతంగా కరువు జిల్లాగా మార్చొద్దు

Sep 3 2016 11:46 PM | Updated on Sep 28 2018 7:36 PM

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు - Sakshi

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : మహబూబ్‌నగర్‌ జిల్లాను అశాస్త్రీయంగా విభజించి శాశ్వత కరువు జిల్లాగా మార్చొద్దని వక్తలు అభిప్రాయ పడ్డారు. శనివారం డీసీసీబీ సమావేశం హాల్‌లో టీజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విభజన శాస్త్రీయతపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

– ఆల్‌ పార్టీ సమావేశంలో వక్తల అభిప్రాయం
జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : మహబూబ్‌నగర్‌ జిల్లాను అశాస్త్రీయంగా విభజించి శాశ్వత కరువు జిల్లాగా మార్చొద్దని వక్తలు అభిప్రాయ పడ్డారు. శనివారం డీసీసీబీ సమావేశం హాల్‌లో టీజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విభజన శాస్త్రీయతపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఏసీ జిల్లా చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నర్సిములు, కాంగ్రెస్‌ నాయకుడు సంజీవ్‌ముదిరాజ్, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు అంబదాస్‌ మాట్లాడారు. అశాస్త్రీయంగా జిల్లాను విభజించి జిల్లాకు అన్యాయం చేయొద్దని కోరారు. జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టును జిల్లాకు కాకుండా చేసే కుట్రలు జరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడుతున్న అమరచింత, ఆత్మకూర్‌ మండలాలతోపాటు సీసీకుంట మండలాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో కనీసం జూరాల లెఫ్ట్‌ బ్యాంక్‌ జిల్లాకు వస్తుందని చెప్పారు. ప్రతిపాదిత మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్క జిల్లా కేంద్రం తప్ప మిగితా నియోజకవర్గాలు పూర్గిగా కరువు చాయలు అలుముకున్న ప్రాంతాలని వివరించారు. ఈ ప్రాంతాల నుంచి అధిక శాతం వలసలు పోతారని, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ ప్రాంతం శాశ్వతంగా వలస జిల్లాగానే మారిపోతుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని శంషాబాద్‌కు కలపడం అన్యాయమని, దీంతో జిల్లాకు వచ్చే అదాయం కూడా పోతుందని అన్నారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రజాప్రతినిధులు గళం విప్పాలని కోరారు. జిల్లాకు జరగుతున్న అన్యాయంపై జేఏసీ ఇచ్చే ప్రతి పోరాటానికి మద్దతు ఇస్తామని వివిధ పార్టీల నాయకులు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ తాలూకా ఇ¯Œæచార్జ్‌ ఎన్‌పీ. వెంకటేశ్, జేఏసీ నాయకులు రామకృష్ణరావు, చంద్రనాయక్, శ్రీదర్‌గౌడ్, పరమేశ్, అంబాదాస్, శాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement