అప్పు తెచ్చి ఇబ్బందులు పడొద్దు | Do not struggle with loans | Sakshi
Sakshi News home page

అప్పు తెచ్చి ఇబ్బందులు పడొద్దు

Jul 30 2016 10:59 PM | Updated on Aug 13 2018 8:03 PM

అప్పు తెచ్చి ఇబ్బందులు పడొద్దు - Sakshi

అప్పు తెచ్చి ఇబ్బందులు పడొద్దు

మిర్యాలగూడ టౌన్‌ ప్రజలు అత్యాశకు పోయి ఎక్కడపడితే అక్కడ అప్పులు తీసుకవచ్చి ఇబ్బందులు పడొద్దని 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి అజిత్‌సింహారావు సూచించారు.

మిర్యాలగూడ టౌన్‌
 ప్రజలు అత్యాశకు పోయి ఎక్కడపడితే అక్కడ అప్పులు తీసుకవచ్చి ఇబ్బందులు పడొద్దని 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి అజిత్‌సింహారావు సూచించారు. శనివారం స్థానిక కోర్టు అవరణలో మండల న్యాయ సేవా సమితి, సెక్యూరిటీ, ఎక్సైజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా రిసోర్స్‌ పర్సన్‌ డాక్టర్‌ పందిరి రవీందర్‌ ఆధ్వర్యంలో ‘ఆర్థిక విద్య’పై నిర్వహించిన అవగాహాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  ప్రజల్లో సరైనా అవగాహన లేకపోవడం వలన కుటుంబాలు, బందాలు విచ్ఛినం అవుతున్నాయన్నారు. డాక్టర్‌ రవీందర్‌ ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయన్నారు. సదస్సులో ఆదాయం, వ్యయాలు, ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు ఏ విధంగా చేసుకోవాలో వివరించారు. కార్యక్రమంలో సినియర్‌ సివిల్‌ జడ్జీ వై.సత్యేంద్ర, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జీ ఎ.రాధాకృష్ణమూర్తి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ. నాగరాజు, స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ పి.లక్ష్మీనారాయణలతో పాటు కోర్టు సిబ్బంది, న్యాయవాదులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement