రైతులకు నష్టం కలిగించొద్దు | do not damage to farmers | Sakshi
Sakshi News home page

రైతులకు నష్టం కలిగించొద్దు

Jul 26 2016 11:34 PM | Updated on Oct 8 2018 9:10 PM

రైతులకు నష్టం కలిగించొద్దు - Sakshi

రైతులకు నష్టం కలిగించొద్దు

భువనగిరి : మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి కోరారు.

భువనగిరి : మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి కోరారు. మంగళవారం భువనగిరిలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మించే నీటి ప్రాజెక్ట్‌లకు తాము వ్యతిరేకం కాదని, 2013 చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. జిల్లాలో డిండి, సింగరాజుపల్లి వంటి రిజ ర్వాయర్‌లలకు చెందిన రైతులకు తక్కువ పరిహారం ఇచ్చారని,  ఇప్పుడు మార్కెట్‌ రేటు ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. గ్రామం పోతే గ్రామస్తులకు భూమికి భూమి, ఇళ్లకు ఇళ్లు కల్పించాలన్నారు. 123 జీఓలో ఈ అంశాలన్ని లేవన్నారు. మల్లన్నసాగర్‌లో పోలీసులు లాఠీచార్జిు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యానాల దామోదర్‌రెడ్డి, మండల కార్యదర్శి ఏశాల అశోక్, నాయకులు ఎండి.ఇమ్రాన్, గడ్డం శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement