విధుల్లో చేరిన డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి | ‍dmho swarajya lakshmi join in duty | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరిన డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి

Jan 5 2017 12:43 AM | Updated on Aug 17 2018 12:56 PM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి బుధవారం సాయంత్రం విధుల్లో చేరారు.

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి బుధవారం సాయంత్రం విధుల్లో చేరారు. గత నెల 14వ తేదీన ఏసీబీ దాడుల అనంతరం ఆమె  అదే నెల 24వ తేది నుంచి సెలవులో వెళ్లారు. ఈ నెల సైతం 15 రోజుల పాటు సెలవు పొడిగించుకునేందుకు ఆమె ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ రామకృష్ణరావును డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ అరుణకుమారి నియమించారు. ఇదే సమయంలో ఆమె బుధవారం తిరిగి విధుల్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement