జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలి: వైఎస్‌ఆర్‌ సీపీ | Division of Revenue should Zaheerabad : YSR CP | Sakshi
Sakshi News home page

జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలి: వైఎస్‌ఆర్‌ సీపీ

Jul 31 2016 8:26 PM | Updated on Sep 4 2017 7:13 AM

జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలి: వైఎస్‌ఆర్‌ సీపీ

జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలి: వైఎస్‌ఆర్‌ సీపీ

జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు ముర్తుజా డిమాండ్‌ చేశారు.

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు ముర్తుజా డిమాండ్‌ చేశారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ డివిజన్‌లను ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు.  అయితే జహీరాబాద్‌ పట్టణం రెవెన్యూ డివిజన్‌కు అన్ని విధాల అనుకూలంగా ఉందన్నారు. జాతీయ రహదారిపై  పలు ప్రాంతాలకు మధ్యలో ఉందన్నారు.
సీనియర్‌ సివిల్‌ కోర్టు, పలు శాఖల ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయన్నారు. నారాయణ ఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు.  రాష్ర్ట ప్రభుత్వం అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని జహీరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ చేయాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రాజ్‌, నాయకుడు ఫసీ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement