తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనానికి 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనానికి 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అయితే తిరుమల రెండో ఘాట్ రోడ్డు 16 కిలోమీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనిపై సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది... సదరు ప్రాంతానికి చేరుకుని... కొండ చరియలను రహదారిపై నుంచి తొలగిస్తున్నారు.