ఐటీడీఏ డిప్యూటీ ఈఓ ఆత్మహత్యాయత్నం | Deputy EO of ITDA to commit suicide | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ డిప్యూటీ ఈఓ ఆత్మహత్యాయత్నం

Sep 12 2016 12:06 AM | Updated on Sep 4 2017 1:06 PM

వ్యక్తిగత కారణాలతో ఐటీడీఏ డిప్యూటీ ఈఓ, తాళ్లగడ్డ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పులుసం సాంబయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రంలోని తాళ్లగడ్డలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

ఏటూరునాగారం : వ్యక్తిగత కారణాలతో ఐటీడీఏ డిప్యూటీ ఈఓ, తాళ్లగడ్డ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పులుసం సాంబయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రంలోని తాళ్లగడ్డలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
 
గ్రామస్తుల కథనం ప్రకారం.. తాళ్లగడ్డ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న సాంబయ్య.. రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఆదివారం ఉదయం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వరంగల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా, సాంబయ్య ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పూర్తి స్థాయిలో తెలియరాలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement