సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామానికి ‘షీల్డు’ | Clean Sanitation village got 'shield' | Sakshi
Sakshi News home page

సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామానికి ‘షీల్డు’

Aug 21 2016 9:25 PM | Updated on Sep 4 2017 10:16 AM

సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామానికి ‘షీల్డు’

సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామానికి ‘షీల్డు’

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా కాట్రపాడు సర్పంచ్‌ రెడ్డిచర్ల నాగమ్మ షీల్డ్‌ను అందుకున్నారు.

మంత్రి అయ్యన్నచేతుల మీదుగా అవార్డు 
అందుకున్న కాట్రపాడు సర్పంచ్‌ నాగమ్మ
 
కాట్రపాడు (దాచేపల్లి): రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా కాట్రపాడు సర్పంచ్‌ రెడ్డిచర్ల నాగమ్మ షీల్డ్‌ను అందుకున్నారు. గ్రామంలో ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో కాట్రపాడును సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా  ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సర్పంచ్‌ నాగమ్మ పాల్గొన్ని మంత్రి చేతుల మీదుగా షీల్డ్‌ను అందుకున్నారు. పంచాయతీ ఖాతాలో రూ.2లక్షల నగదును ప్రభుత్వం జమ చేస్తుందని ఆమె చెప్పారు. సర్పంచ్‌ వెంట పంచాయతీ కార్యదర్శి పి. విజయ్‌కుమార్, ఏపీవో జీ. వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement