కుండపోత వర్షం! | Chodavaram heavy rain on Wednesday! | Sakshi
Sakshi News home page

కుండపోత వర్షం!

Aug 15 2013 3:39 AM | Updated on Oct 1 2018 2:00 PM

ఇటీవల ఎన్నడూ లేనం త భారీగా బుధవారం కుండపోత వర్షం కురి సింది. రైతాంగానికి ఊరటనిచ్చింది.

చోడవరం,న్యూస్‌లైన్: ఇటీవల ఎన్నడూ లేనం త భారీగా బుధవారం కుండపోత వర్షం కురి సింది. రైతాంగానికి ఊరటనిచ్చింది. నీలం తుపాను తర్వాత ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పట్నుంచి దుక్కు వర్షం కోసం రైతులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సీజన్ ముగుస్తున్న తరుణంలో నాలుగు రోజులుగా వర్షాలు  కురుస్తున్నాయి.

బుధవారం చోడవరంలో అత్యధికంగా 7 సెం.మీ.ల వర్షపాతం నమోదయిం ది. మాడుగుల, కె.కోటపాడులలో 5 సెం.మీ లు, చీడికాడలో 4.5, రావికమతంలో 4, బుచ్చెయ్యపేటలో 3 సెం.మీల చొప్పున వర్షం కురి సింది. చోడవరం పట్టణంలో లోతట్టు ప్రాంతాలతో పాటు గవర్నమెంట్ హైస్కూల్ ఆవరణ, బానీకోనేరు, రెల్లివీధి, బాలాజీనగర్, న్యూశాం తినగర్ ప్రాంతాలు నీటమునిగాయి.

చెరువుల్లో ను పంట పొలాల్లోనూ భారీగా నీరు చేరింది. కొండగెడ్డల్లో నీరు ప్రవహించింది.ఈ వర్షం చెర కు, అపరాల పంటలకు ఎంతో మేలు చేయగా వరి నాట్లు జోరందుకోవడానికి దోహదపడనున్నాయి. మెరుపులు, ఉరుములు పెద్ద శబ్ధాలా తో రావడంతో జనం భయకంపితులయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement