క్రికెట్‌ టోర్నీ చాంపియన్‌ ఆర్‌ఎంసీ | champion rmc | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ టోర్నీ చాంపియన్‌ ఆర్‌ఎంసీ

Jul 29 2016 1:42 AM | Updated on Sep 4 2017 6:46 AM

క్రికెట్‌ టోర్నీ చాంపియన్‌ ఆర్‌ఎంసీ

క్రికెట్‌ టోర్నీ చాంపియన్‌ ఆర్‌ఎంసీ

రంగరాయ మెడికల్‌ కళాశాల క్రికెట్‌ జట్టు ఆలిండియా మెడికల్‌ కళాశాలల క్రికెట్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఈనెల 17 నుంచి 25 వరకు తమిళనాడు లోని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాలలో జరిగిన టోర్నీ ఫైనల్‌లో ఆర్‌ఎంసీ జట్టు పుదుచ్చేరి జట్టుపై విజయం సాధించింది.

కాకినాడ సిటీ : 
రంగరాయ మెడికల్‌ కళాశాల క్రికెట్‌ జట్టు ఆలిండియా మెడికల్‌ కళాశాలల క్రికెట్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఈనెల 17 నుంచి 25 వరకు తమిళనాడు లోని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాలలో జరిగిన టోర్నీ ఫైనల్‌లో ఆర్‌ఎంసీ జట్టు పుదుచ్చేరి జట్టుపై విజయం సాధించింది. ట్రోఫీతో కళాశాలకు చేరుకున్న జట్టు సభ్యులను గురువారం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, ఆర్‌ఎంసీ జట్టు పీడీ స్పర్జన్‌రాజు అభినందించారు. ప్రిన్సిపాల్‌ మహాలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు ప్రాధాన్యతనిస్తూనే క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఆలిండియా స్థాయిలో 2010లో విజేతగా, 2012లో ద్వితీయస్థానంలో నిలిచిందని, ఇప్పుడు మళ్లీ విజ యం సాధించడం అభినందనీయమని అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement