మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ | chain snatching | Sakshi
Sakshi News home page

మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ

Aug 5 2016 1:41 AM | Updated on Sep 4 2017 7:50 AM

నిడదవోలు : ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు.

నిడదవోలు : ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. పట్టణంలోని గాంధీనగర్‌ మునిసిపల్‌ పార్కు వద్ద కాకి అప్పాయమ్మ నివాసముంటున్నారు. బుధవారం ఆమె మెడలోని సుమారు మూడున్నర కాసుల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుని పోయాడు. దీంతో  అప్పాయమ్మ భర్త కాకి సూర్యరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం. భగవాన్‌ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement