ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అన్నివిధాల సహకరిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అన్నివిధాల సహకరిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై ఉన్న న్యాయపరమైన వివాదాలపై చట్టప్రకారం నడుచుకుంటామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రకాశ్ జవదేకర్తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం జవదేకర్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో ఎక్కువ శాతం అడవులు పోతున్నందున పరిహారంగా మరింత ఎక్కువ విస్తీర్ణంలో అడవులను పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు.